వేమన పద్య రత్నాకరము ఒక మంచి పుస్తకము చదువుతున్నాను. ఈ పుస్తకంలో వేమన పద్యాలతో పాటు వాటి తాత్పర్యము కూడా ఉంది. మొత్తం ౨౫౦౭ (2507) పద్యాలు ఉన్నాయి. విశాలాంధ్ర బుక్ హౌస్ వారి మొబైల్ బుక్ హౌస్ (ఫోన్: 040 2460 2946 / 040 2465 5279) IIIT కి వచ్చింది. చ్చప్పున అవకాశం గ్రహించి కొన్ని పుస్తకాలూ తీసుకున్నాను. వాటిలో తెనాలి రామకృష్ణ కవి గురించి ఒక పుస్తకం, పంచతంత్రం గురించి ఒక పుస్తకం ఉన్నాయి.

వేమన పద్య రత్నాకరము వ్యాఖ్యాత భాగవతుల సుబ్రహ్మణ్యం గారు. నవరత్న బుక్ హౌస్ (అరండల్ పేట, రెహమాన్ వీధి, విజయవాడ – 2). వీరి పుస్తకును కొని వ్యాఖ్యాతను, నవరత్న బుక్ హౌస్ ను ప్రోత్సాహించవలసిందిగా ప్రార్ధన.

వీరు తెలుగు భాషకు చేసిన సేవకు ఒక తెలుగు వాడిగా నా కృతఙ్ఞతలు. నేను కొన్ని పద్యములు నా బ్లాగ్లో ఉంచుట వాటిని అందరికి అందుబాటులోకి తేవడమే కానీ వారి ప్రచురణ హక్కులు భంగాపరుచుట కాదు.

[gallery link="file" columns="2"]

Related posts:

  1. వేమన పద్యం 2

Comments

Leave a Reply