పద్యం

అతి హితమగు నట్టు లాడిన మాటకు

సంతసింతు రెల్ల సత్పురుషులు

అధిక భాషణంబు లాయాసదంబులు

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

అందరినీ ఒప్పించేలా మాట్లాడగల నేర్పు సత్పురుషుల సొత్తు. కనుక వారిని అందరూ మెచ్చుకుని, ఆనందాన్ని పొందుతారు. అదే విధంగా కంఠశోష కలిగించే అధిక ప్రసంగాలు సజ్జనులను ఆకట్టుకోవు.

Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

 

Comments

Leave a Reply