పద్యం

శాంతమే జనులను జయము నొందించును
శాంతముననే గురుని జాడ తెలియు
శాంత భావ మహిమ చర్చింపలేమయా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

శాంతంగా ఉంటే అన్నింటా జయం కలుగుతుంది. శాంత స్వభావం వల్లనే ప్రజలు సత్పురుషుల్ని చూడ గల్గుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే శాంతం యొక్క గొప్పతనం చర్చకు అలవి కానిది.

Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

 

Comments

One Response to వేమన పద్యం # ౩ శాంతము

  1. nagaraju says:

    hello sir i have some of the poems nearly more than 100, but i want to publish all the poems please suggest me contact address

Leave a Reply